Stories of tirumala: అనంతాల్వారు శ్రీనివాసునికి మామ ఎలా అయ్యాడు: అనంతాల్వారు శ్రీనివాసునికి ప్రియ భక్తుడు. భగవత్ రామానుజుల వారి శిష్యుడు. ఆయన కోరిక మేరకు స్వామి వారి సేవ కోసం తిరుమల కు వచ్చిన వాడు. స్వామి వారి సేవ కు అయ్యేటటువంటి పూల కోసం ఒక పూల తోటను పెంచడానికి తిరుమలకు చేరుకున్నారు. తిరుమలనంబి గారి సలహాతో స్వామి వారి ఆలయం వెనుక పూల తోటను పెంచి వాటిని స్వామి సేవకు అర్పించేవాడు. పూల చెట్లకు నీటి కోసం ఒక చెరువును తవ్వడానికి సంకల్పించాడు. ఆయన మరియు గర్భ వతిగా ఉన్న ఆయన భార్య కలిసి చెరువును తవ్వుతుండగా స్వామి వారు బాలుడి రూపంలో అక్కడకు వచ్చాడు. నేను కూడా సహాయం చేస్తాను అని అనంతాల్వారుని అడిగాడు. బాలుడి రూపంలో వచ్చినందున స్వామిని ఆయన గుర్తు పట్టలేదు. ఈ భాగ్యం మాకు మాత్రమే కావాలని ఇది వారి పూర్వ జన్మ సుకృతం అని ఆ బాలుడి అభ్యర్థనను తిరస్కరిస్తాడు. స్వామి వారు అక్కడనుండి వెళ్లి అంతాల్వరు భార్యకు సహాయం చేస్తూ ఉంటాడు. ఇది చూసిన అనంతాల్వారు కోపం తో తన చేతిలో ఉన్న గునపం తొ స్వామి వారిని కొడతాడు. ఆ గునపం స్వామి వారి గడ్డానికి తగులుతుంది. అనంతాల్వారు స్వామి వారికి పూలను తీసుకుని ఆ...