Stories of tirumala:
అనంతాల్వారు శ్రీనివాసునికి మామ ఎలా అయ్యాడు:అనంతాల్వారు శ్రీనివాసునికి ప్రియ భక్తుడు. భగవత్ రామానుజుల వారి శిష్యుడు. ఆయన కోరిక మేరకు స్వామి వారి సేవ కోసం తిరుమల కు వచ్చిన వాడు. స్వామి వారి సేవ కు అయ్యేటటువంటి పూల కోసం ఒక పూల తోటను పెంచడానికి తిరుమలకు చేరుకున్నారు. తిరుమలనంబి గారి సలహాతో స్వామి వారి ఆలయం వెనుక పూల తోటను పెంచి వాటిని స్వామి సేవకు అర్పించేవాడు. పూల చెట్లకు నీటి కోసం ఒక చెరువును తవ్వడానికి సంకల్పించాడు. ఆయన మరియు గర్భ వతిగా ఉన్న ఆయన భార్య కలిసి చెరువును తవ్వుతుండగా స్వామి వారు బాలుడి రూపంలో అక్కడకు వచ్చాడు. నేను కూడా సహాయం చేస్తాను అని అనంతాల్వారుని అడిగాడు. బాలుడి రూపంలో వచ్చినందున స్వామిని ఆయన గుర్తు పట్టలేదు. ఈ భాగ్యం మాకు మాత్రమే కావాలని ఇది వారి పూర్వ జన్మ సుకృతం అని ఆ బాలుడి అభ్యర్థనను తిరస్కరిస్తాడు. స్వామి వారు అక్కడనుండి వెళ్లి అంతాల్వరు భార్యకు సహాయం చేస్తూ ఉంటాడు. ఇది చూసిన అనంతాల్వారు కోపం తో తన చేతిలో ఉన్న గునపం తొ స్వామి వారిని కొడతాడు. ఆ గునపం స్వామి వారి గడ్డానికి తగులుతుంది.
అనంతాల్వారు స్వామి వారికి పూలను తీసుకుని ఆలయానికి వెళతాడు. ఆలయం లో ఉన్న స్వామి వారి విగ్రహానికి గడ్డం మీద రక్తం రావడం చూసి బాలుడి రూపం లో తనకు సహాయం చేయడానికి వచ్చినది ఆ శ్రీనివాసుడి అని గ్రహిస్తాడు. వెంటనే అక్కడున్న కర్పూరాన్ని తీసుకుని స్వామి వారి గడ్డానికి పుస్తాడు. ఇప్పటికీ కి కూడా స్వామి వారి గడ్డానికి కర్పూరం రాయడం ఆనవాయితీ గా మారింది. అంతల్వారు స్వామి వారిని కొట్టిన గునపాన్ని ఆలయ మహాద్వారం వద్ద మనం ఇప్పటికీ చూడ వచ్చును.
స్వామి వారిని కొట్టినందుకు గాను అనంతాల్వరు ఎంతగానో బాధ పడ్డాడు. రోజు యధా విధిగా స్వామి వారికి పూలను సమర్పించేవారు. స్వామి వారు ఇంకొక సారి అనంతాల్వారుని పరీక్షించ దలిచాడు. రోజు ఏకాంత సేవ తరువాత చిన్న పిల్లల రూపంలో పద్మావతీ దేవి సమేతుడై అనంతల్వారు పెంచిన పూల తోటలో విహరిచడానికి వెళ్లే వాడట. రోజు ఆ తోటలో పూలు కొమ్మలు తెంచి పోయె వాళ్ళట. ఎవరిలా చేస్తున్నారో అర్థం కాక ఒక రోజు కావాలి కాశాడంట స్వామి వారు మరియు అమ్మ వారు ఇద్దరు వచ్చారంట. వెంటనే చిన్న పాప రూపంలో అమ్మవారిని పట్టుకుని ఓ చెట్టుకు కట్టేసి స్వామి వారితో మీ వాళ్ళని తీసుకుని వేస్తే వదులుతనని చెప్పాడంట. బాలుడి రూపంలో ఉన్న స్వామి వారు అక్కడనుండి వెళ్ళిపోయాడట.
సుప్రభాత సేవ సమయం కావడంతో గర్భగుడి తలుపులు తెరిచి చూసేటప్పటికీ స్వామి వారి వక్ష స్థలం పై వుండవలసిన అమ్మ వారి విగ్రహం కనబడలేదు. అందరూ అది చూసి ఆశ్చర్య పోయారట. అప్పుడు విగ్రహం దగ్గరనుండి భవిష్య వాణి వినిపించింది అంట. అమ్మ వారు అనంతల్వారు తోటలో ఉంది అని. వెంటనే ఈ విషయం అనంతల్వర్ కి చెప్పగా వెళ్లి తోటలో చూసే సరికి ఆయనకు అర్థం అయిందట. తాను కట్టేసింది సాక్షాత్తు శ్రీ పద్మావతి దేవి ని అని. అక్కడ నుండి అమ్మవారిని పూల బుట్టలో తీసుకుని వెళ్లారట. గర్భగుడి లోకి వెళ్ళగానే అమ్మవారు తన స్థానానికి వెళ్ళిపోయింది. అప్పుడు విగ్రహం నుండి మాటలు వినిపించాయంట. పెళ్లి కూతురి లాగా పూల బుట్టలో పెట్టుకుని తీసుకుని వచ్చావు ఈ రోజు నుండి నువ్వు నాకు మామవు అని. ఈ విషయాన్ని అనంతల్వార్ గారి చరిత్ర లో కూడా చెప్పబడినది. కరుణామయుడు అయిన శ్రీనివాసుడు తన భక్తులను ఎల్ల వేళల కాచుకుని ఉంటాడు అనడానికి ఈ కథ ఒక నిదర్శనం..
To know:
- Stories of tirumala
- Stories of lard venkateswara
- Latest updates of tirumala
- Visit vaikuntamtrip.blogspot.com
Very very nice information
ReplyDeleteValuable information
ReplyDelete