Skip to main content

Ananthaachaaryula vaaritho Swamy leelalu


Stories of tirumala:
అనంతాల్వారు శ్రీనివాసునికి మామ ఎలా అయ్యాడు:

అనంతాల్వారు శ్రీనివాసునికి ప్రియ భక్తుడు. భగవత్ రామానుజుల వారి శిష్యుడు.  ఆయన కోరిక మేరకు స్వామి వారి సేవ కోసం తిరుమల కు వచ్చిన వాడు. స్వామి వారి సేవ కు అయ్యేటటువంటి పూల కోసం ఒక పూల తోటను పెంచడానికి తిరుమలకు చేరుకున్నారు. తిరుమలనంబి గారి సలహాతో స్వామి వారి ఆలయం వెనుక పూల తోటను పెంచి వాటిని స్వామి సేవకు అర్పించేవాడు. పూల చెట్లకు నీటి కోసం ఒక చెరువును తవ్వడానికి సంకల్పించాడు. ఆయన మరియు గర్భ వతిగా ఉన్న ఆయన భార్య కలిసి చెరువును తవ్వుతుండగా స్వామి వారు బాలుడి రూపంలో అక్కడకు వచ్చాడు. నేను కూడా సహాయం చేస్తాను అని అనంతాల్వారుని అడిగాడు. బాలుడి రూపంలో వచ్చినందున స్వామిని ఆయన గుర్తు పట్టలేదు. ఈ భాగ్యం మాకు మాత్రమే కావాలని ఇది వారి పూర్వ జన్మ సుకృతం అని ఆ బాలుడి అభ్యర్థనను తిరస్కరిస్తాడు. స్వామి వారు అక్కడనుండి వెళ్లి అంతాల్వరు భార్యకు సహాయం చేస్తూ ఉంటాడు. ఇది చూసిన అనంతాల్వారు కోపం తో తన చేతిలో ఉన్న గునపం తొ స్వామి వారిని కొడతాడు. ఆ గునపం స్వామి వారి గడ్డానికి తగులుతుంది. అనంతాల్వారు స్వామి వారికి పూలను తీసుకుని ఆలయానికి వెళతాడు. ఆలయం లో ఉన్న స్వామి వారి విగ్రహానికి గడ్డం మీద రక్తం రావడం చూసి బాలుడి రూపం లో తనకు సహాయం చేయడానికి వచ్చినది ఆ శ్రీనివాసుడి అని గ్రహిస్తాడు. వెంటనే అక్కడున్న కర్పూరాన్ని తీసుకుని స్వామి వారి గడ్డానికి పుస్తాడు. ఇప్పటికీ కి కూడా స్వామి వారి గడ్డానికి కర్పూరం రాయడం ఆనవాయితీ గా మారింది. అంతల్వారు స్వామి వారిని కొట్టిన గునపాన్ని ఆలయ మహాద్వారం వద్ద మనం ఇప్పటికీ చూడ వచ్చును. 

 
స్వామి వారిని కొట్టినందుకు గాను అనంతాల్వరు ఎంతగానో బాధ పడ్డాడు. రోజు యధా విధిగా స్వామి వారికి పూలను సమర్పించేవారు. స్వామి వారు ఇంకొక సారి అనంతాల్వారుని పరీక్షించ దలిచాడు. రోజు ఏకాంత సేవ తరువాత చిన్న పిల్లల రూపంలో పద్మావతీ దేవి సమేతుడై అనంతల్వారు పెంచిన పూల తోటలో విహరిచడానికి వెళ్లే వాడట. రోజు ఆ తోటలో పూలు కొమ్మలు తెంచి పోయె వాళ్ళట. ఎవరిలా చేస్తున్నారో అర్థం కాక ఒక రోజు కావాలి కాశాడంట స్వామి వారు మరియు అమ్మ వారు ఇద్దరు వచ్చారంట. వెంటనే చిన్న పాప రూపంలో అమ్మవారిని పట్టుకుని ఓ చెట్టుకు కట్టేసి స్వామి వారితో మీ వాళ్ళని తీసుకుని వేస్తే వదులుతనని చెప్పాడంట. బాలుడి రూపంలో ఉన్న స్వామి వారు అక్కడనుండి వెళ్ళిపోయాడట. సుప్రభాత సేవ సమయం కావడంతో గర్భగుడి తలుపులు తెరిచి చూసేటప్పటికీ స్వామి వారి వక్ష స్థలం పై వుండవలసిన అమ్మ వారి విగ్రహం కనబడలేదు. అందరూ అది చూసి ఆశ్చర్య పోయారట. అప్పుడు విగ్రహం దగ్గరనుండి భవిష్య వాణి వినిపించింది అంట. అమ్మ వారు అనంతల్వారు తోటలో ఉంది అని. వెంటనే ఈ విషయం అనంతల్వర్ కి చెప్పగా వెళ్లి తోటలో చూసే సరికి ఆయనకు అర్థం అయిందట. తాను కట్టేసింది సాక్షాత్తు శ్రీ పద్మావతి దేవి ని అని. అక్కడ నుండి అమ్మవారిని పూల బుట్టలో తీసుకుని వెళ్లారట. గర్భగుడి లోకి వెళ్ళగానే అమ్మవారు తన స్థానానికి వెళ్ళిపోయింది. అప్పుడు విగ్రహం నుండి మాటలు వినిపించాయంట. పెళ్లి కూతురి లాగా పూల బుట్టలో పెట్టుకుని తీసుకుని వచ్చావు ఈ రోజు నుండి నువ్వు నాకు మామవు అని. ఈ విషయాన్ని అనంతల్వార్ గారి చరిత్ర లో కూడా చెప్పబడినది. కరుణామయుడు అయిన శ్రీనివాసుడు తన భక్తులను ఎల్ల వేళల కాచుకుని ఉంటాడు అనడానికి ఈ కథ ఒక నిదర్శనం..
To know:

Comments

Post a Comment

Popular posts from this blog

7th NOV 1979 AT TIRUMALA TEMPLE :

7th NOV 1979 AT TIRUMALA TEMPLE :   1976 లో తిరుమల : తిరుమల లో శ్రీనివాసుడు స్వయంభువు గ వెలిసి ఉన్నాడు అని చెప్పడానికి ఎప్పుడు ఏదో ఒక అద్భుత సంఘటనలు జరుగుతూ ఉంటాయి . ఆ వేంకటేశ్వరుడు తన భక్తులకు ఎప్పుడు అండగా ఉంటాడు అని చెప్పడానికి 1979 లో జరిగిన ఒక సంఘటనను తెలుసుకుందాం .  ఈ సంవత్సరం లో తిరుమలలో నీటి నిలువలు బాగా తగ్గిపోయాయి . తిరుమల అంతటికి గోగర్భం రిజర్వాయరు నుండి నీటిని వినియోగించేవారు . ఆ రిజర్వాయరులో కూడా నీటి నిలువలు అడుగంటిపోయాయి . కొండా మీద ఉండే   ఇతర చెరువులు కూడా ఇంకిపోయాయి . ఆ సమయంలో టీటీడీ పరిపాలనాధికారి గా   PVRK ప్రసాద్   గారు ఉన్నారు . కొండా మీద ఉండే నీటి నిలువలు కేవలం వారం రోజులకు మాత్రమే సరిపోతాయని ఇంజినీర్లు చెప్పారు .   శ్రీ వారి దర్శనాన్ని కూడా నిలిపివేయాల్సి పరిస్థితి వచ్చేలా ఉందని టీటీడీ సభ్యులందరు సమావేశమయ్యారు . ఆ సమావేశంలో వర్షాలు పడటానికి యాగం చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని సలహా ఇచ్చారు .       PVRK ...

Govindhraaja Swamy temple mystery

GOVINDARAJA SWAMY TEMPLE MISTERY TIRUPATI: తిరుపతి శ్రీ గోవింద రాజ స్వామి వారి ఆలయ మిస్టరీ : తిరుపతి లో శ్రీ గోవింద రాజ స్వామి వారి ఆలయం గురించి మనందరికీ తెలుసు. చాలా మంది భక్తులు తిరుమల శ్రీ వేంటేశ్వరస్వామిని దర్శనం చేసుకున్న తరువాత తిరుపతిలో శ్రీ గోవింద రాజ స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. వెంకటేశ్వర స్వామి వారికి అన్న గారుగా పిలువబడే గోవింద రాజ స్వామి వారి ఆలయం ఎలా నిర్మించబడినది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం.ఈ ఆలయం యొక్క చరిత్రను చూస్తే మనకు ఎన్నో ఆశ్చర్యం కలిగించే విషయాలు వెలుగులోకి వస్తాయి. 1979 కి పూర్వం ఆలయం యొక్క సింహ ద్వారం తరువాత కుడి వైపున గోవింద రాజ స్వామి ఆలయం మరియు ఎడమ వైపు ఆండాళ్ అమ్మ వారి ఆలయం ఉండేవి. మధ్యలో  గోడ మాత్రమే ఉండేది. కానీ వెనక నుండి గమనిస్తే ఎదో ఒక గది ఉన్నట్లు గా ఉండేది. ఇది గమనించిన అప్పటి టీటీడీ పరిపాలన అధికారి PVRK ప్రసాద్ గారు మధ్యలో ఉండే గోడ గురించి పూజారులను అడిగారు. అయితే వారు చెప్పిన సమాధానం ఆయనకు సంతృప్తి గా అనిపించలేదు. పురాతన గ్రంధాలు చదివిన ఆయనకు అక్కడ శ్రీ పార్థసారథి స్వామి వారి ఆలయం ఉండేది అని తెలిసింది. అయితే ఆ ఆలయం ఏమైంది, గోవింద రాజ ...

TTD PROVIDES SERVICES TO PILGRIMS

తిరుపతిలో భక్తుల కోసం టీటీడీ అందించే సేవలు తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో అనేక ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ వారి దర్శనార్థం వేల కొలది భక్తులు తిరుపతి నుండి తిరుమలకు చేరుకోవడం జరుగుతుంది. బస్సు ద్వారా వచ్చే ప్రయాణికుల కోసం శ్రీనివాసం మరియు రైలు మార్గం ద్వారా వచ్చే భక్తుల వేచి ఉండటం మరియు విశ్రాంతి కోసం విష్ణు నివాసం పేరుతో పెద్ద భవనాలు నిర్మించడం జరిగింది. ఇక్కడ online మరియు offline ద్వారా గదులు బుక్ చేసుకోవచ్చును. శ్రీ వారి దర్శనానికి ఇక్కడే టిక్కెట్లు ఇవ్వడం జరుగుతుంది.భక్తులకు ఉచిత అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు. తిరుపతి నుండి తిరుమలకు వెళ్ళడానికి బస్సులను ఏర్పాటు చేశారు. అలిపిరి మేట్లు, శ్రీవారి మెట్ల వద్దకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. తిరుపతి లోని వివిధ ఆలయాలలో దర్శన ఏర్పాట్లు,ప్రసాదం సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. తిరుమలకు ఎక్కువ మంది మెట్ల మార్గం గుండా వెళ్ళడానికి ఇష్టపడతారు. అందువల్ల అలిపిరి మార్గం మరియు శ్రీవారి మెట్ల మార్గాన్ని ఎంతో అందంగా సౌకర్య వంతంగా తీర్చి దిద్దారు. మార్గం లో మంచి నీటి సౌకర్యం మరియు ఉచిత మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.మార్గ మధ్...