7th NOV 1979 AT TIRUMALA TEMPLE :
1976 లో తిరుమల:
తిరుమల లో శ్రీనివాసుడు స్వయంభువు గ వెలిసి ఉన్నాడు అని చెప్పడానికి ఎప్పుడు ఏదో ఒక అద్భుత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ వేంకటేశ్వరుడు తన భక్తులకు ఎప్పుడు అండగా ఉంటాడు అని చెప్పడానికి 1979 లో జరిగిన ఒక సంఘటనను తెలుసుకుందాం. ఈ సంవత్సరం లో తిరుమలలో నీటి నిలువలు బాగా తగ్గిపోయాయి. తిరుమల అంతటికి గోగర్భం రిజర్వాయరు నుండి నీటిని వినియోగించేవారు. ఆ రిజర్వాయరులో కూడా నీటి నిలువలు అడుగంటిపోయాయి. కొండా మీద ఉండే ఇతర చెరువులు కూడా ఇంకిపోయాయి. ఆ సమయంలో టీటీడీ పరిపాలనాధికారి గా PVRK ప్రసాద్ గారు ఉన్నారు. కొండా మీద ఉండే నీటి నిలువలు కేవలం వారం రోజులకు మాత్రమే సరిపోతాయని ఇంజినీర్లు చెప్పారు. శ్రీ వారి దర్శనాన్ని కూడా నిలిపివేయాల్సి పరిస్థితి వచ్చేలా ఉందని టీటీడీ సభ్యులందరు సమావేశమయ్యారు. ఆ సమావేశంలో వర్షాలు పడటానికి యాగం చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని సలహా ఇచ్చారు.
PVRK గారికి కూడా ఈ సలహా కొంచెం బాగానే అనిపించింది. వెంటనే ఆయన ఏ మాత్రం ఆలసయం చేయకుండా గొప్ప వేదపండితులయిన ఉప్పులూరి గణపతి శాస్త్రి గారిని కలిసి వర్షాలు పడటానికి పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. అప్పుడు గణపతి శాస్త్రి గారు వేదాలు, శాస్త్రాలు చూసి వరుణ యాగం చేయడం వల్ల వర్షాలు పడడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇక వెంటనే వాయునా యాగానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. నవంబరు 1 తేదీన ముహూర్తం నిర్వహించారు. దురదృష్ట వశాత్తు ఆ రోజు యాగం చేయడానికి రావలసిన పండితుడికి అనారోగ్యం కారణంగా యాగం వాయిదా పడింది. రెండు రోజుల తరువాత మరో ముహూర్తం నిర్ణయించారు. కొన్ని అనివార్య కారణాల వాళ్ళ ఈ సారి కూడా యాగం ఆయిపోయింది. PVRK గారికి ఏమి చేయాలో అర్థం గాక ఎందుకు ఇతడి పరీక్ష అని స్వైవారి ముందు కన్నీరు కార్చారు. 7 వ తేదీ రాత్రి శ్రీవారి కి ఏకాంత సేవ అయిపోయిన తరువాత గుడిని మూసి వేసి పండితులు వారి గృహాలకు వెళ్లిపోయారు. ఇంతలో శ్రీ వారి ఆలయం లో గంటలు పెద్దగా మోగడం చూసి అందరూ అక్కడికి చేరుకున్నారు. టీటీడీ ఉద్యోగులు, పండితులు, పోలీసులు, పత్రిక విలేకరుల తో పాటు PVRK గారు కూడా అక్కడకు చేరుకున్నారు.
తిరుమల కొండలు ప్రతిధ్వనించేలా గంటలు మోగుతున్నాయి. బహుశా ఎవరైనా భక్తుడు లోపల ఉండిపోయాడేమో అని అనుకున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం ఎప్పుడు పడితే అప్పుడు శ్రీవారి ఆలయాన్ని తెరవకూడదు. అందువల్ల సుప్రభాత సమయం వరకు ఎదురుచూసి సమయం కాగానే అందరూ శ్రీవారి ఆలయంలోకి వెళ్లి ప్రతి అంగుళం వెతికి చూసారు. కానీ ఎక్కడ వారికి ఎవ్వరు కనబడలేదు. బహుశా శ్రీవారు యాగానికి ఈ విధం గా అనుమతి తెలిపారేమో అని భావించి ఆ మరుసటి రోజే యాగానికి ముహూర్తం నిర్ణయించారు.
వేద పండితులంతా తిరుమలకు చేరుకున్నారు. నియమ నిష్ఠలతో యాగాన్ని పూర్తిచేశారు. యాగంలో భాగంగా శ్రీ వారి ఉస్త్సవ విగ్రహాలను పుక్ష్కరిణి స్నానపానాదులు చేయించారు. యాగం పూర్తయ్యింది. ఆకాశం వైకు చూస్తే ఎర్రని ఎండలు తప్ప ఎక్కడ మేఘాలు కనిపించలేదు. PVRK గారు బాధతో శ్రీవారిని వేడుకున్నాడు. శ్రీ వారి ఉత్సవ విగ్రహాలను పుష్కరిణి నుండి ఆలయం లోకి తీసుకుని పోసాగారు. ఇంతారు విపరీతమైన మబ్బులు ఆకాశాన్ని కమ్మేశాయి. చూస్తుండగానే వర్షం మొదలయ్యింది. దాదాపుగా రెండు రోజులు భారీ వర్షాలు పడ్డాయి. తరువాత వెళ్లి చూస్తూ తిరుమల గోగర్భం రిజర్వాయరు పూర్తిగా నిండి పోయి పొర్లుతోంది. తిరుమల లో ఉండే అన్ని చెరువులు, బావులు పూర్తిగా నిండిపోయాయి. ఇదంతా శ్రీవారి లీలగా అందరూ భావించారు
NclarquiAnega Jill Smith link
ReplyDeletelimengunscor