GOVINDARAJA SWAMY TEMPLE MISTERY TIRUPATI:
తిరుపతి శ్రీ గోవింద రాజ స్వామి వారి ఆలయ మిస్టరీ:
తిరుపతి లో శ్రీ గోవింద రాజ స్వామి వారి ఆలయం గురించి మనందరికీ తెలుసు. చాలా మంది భక్తులు తిరుమల శ్రీ వేంటేశ్వరస్వామిని దర్శనం చేసుకున్న తరువాత తిరుపతిలో శ్రీ గోవింద రాజ స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. వెంకటేశ్వర స్వామి వారికి అన్న గారుగా పిలువబడే గోవింద రాజ స్వామి వారి ఆలయం ఎలా నిర్మించబడినది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం.ఈ ఆలయం యొక్క చరిత్రను చూస్తే మనకు ఎన్నో ఆశ్చర్యం కలిగించే విషయాలు వెలుగులోకి వస్తాయి.
1979 కి పూర్వం ఆలయం యొక్క సింహ ద్వారం తరువాత కుడి వైపున గోవింద రాజ స్వామి ఆలయం మరియు ఎడమ వైపు ఆండాళ్ అమ్మ వారి ఆలయం ఉండేవి. మధ్యలో గోడ మాత్రమే ఉండేది. కానీ వెనక నుండి గమనిస్తే ఎదో ఒక గది ఉన్నట్లు గా ఉండేది. ఇది గమనించిన అప్పటి టీటీడీ పరిపాలన అధికారి PVRK ప్రసాద్ గారు మధ్యలో ఉండే గోడ గురించి పూజారులను అడిగారు. అయితే వారు చెప్పిన సమాధానం ఆయనకు సంతృప్తి గా అనిపించలేదు. పురాతన గ్రంధాలు చదివిన ఆయనకు అక్కడ శ్రీ పార్థసారథి స్వామి వారి ఆలయం ఉండేది అని తెలిసింది. అయితే ఆ ఆలయం ఏమైంది, గోవింద రాజ స్వామి వారి ఆలయం ఎలా వచ్చింది అనే ప్రశ్నలు ఆయనలో మెదిలాయి. శిల్పులలో అగ్రగణ్యులు అయిన వారిని పిలిపించి ఆలయ నిర్మాణం చూపించారు. వారు ఆలయ కొలతలు, ప్రాకారం చూసి మధ్యలో ఇంకొక గది ఉండవచ్చు ఆని తేల్చారు. అప్పుడు PVRK గారు పండితులను సంప్రదించి ఆ గోడను పగల గొట్టించారు. ఆ గోడ వెనుక గది రుక్మిణీ, సత్యభామ సమేతుడైన శ్రీ పార్థ సారధి స్వామి వారి విగ్రహాలు కనిపించాయి. PVRK గారు సంతోషంతో ఆ విగ్రహాలు తిరిగి ప్రతిష్ట జరిపించారు. ముస్లింల యొక్క దండయాత్ర వల్ల పార్థసారథి స్వామి వారి ఆలయం ధ్వంసం కాకుండా గొడకట్టిండవచ్చు అని భావిస్తున్నారు.మనం గోవింద రాజ స్వామి వారి ఆలయం లోకి వెళితే సింహ ద్వారం ఎదురుగా పార్థసారథి స్వామి వారు, కుడి వైపున గోవింద రాజ స్వామి వారు, ఎడమ వైపు ఆండాళ్ అమ్మ వారు దర్శనం ఇస్తారు. పురాణాల ప్రకారం ఆ ఆలయం పార్థ సారథి స్వామి వారిది అయితే మరి గోవింద రాజ స్వామి వారి విగ్రహం ఎలా వచ్చింది అనేది అందరి మదిలో మెదిలే ప్రశ్న...
పూర్యం చిదంబరం ప్రాంతాన్ని కులోత్తుంగ చోళుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజు శివ భక్తుడు, తన రాజ్యంలో శైవ మతం తప వైష్ణవ మతం ఉండకూడదని వైష్ణవ ఆలయాలు అన్ని ధ్వంసం చేయించాడు. చిదంబరం లోని శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ గోవింద రాజ స్వామి వారిని విగ్రహం తో పాటు పెకలించి సముద్రం లో పడవేస్తాడు. కొన్ని సంవ్సరాల తరువాత ఆ విగ్రహం బయటపడి వైష్ణవ భక్తుల కు కనిపించింది. రాజు ఆ విగ్రహం కనిపిస్తే పూర్తిగా ధ్వంసం చేస్తాడని భావించి తిరుమలకు తరలించారు. ఆ సమయం లో రామానుజాచార్యుల తిరుపతిలో ఉన్నారు. ఆయన ఈ విగ్రహం చూసి ఒక ఆలయాన్ని సంకల్పించారు. ఇప్పుడు ఉన్న స్థానంలో గోవింద రాజ స్వామి వారి ఆలయాన్ని నిర్మించాడు. అయితే చిదంబరం నుండి తెచ్చిన విగ్రం కొన్ని సంవ్సరాలపాటు సముద్రం లో ఉండటం వల్ల ఆ విగ్రహానికి పగుళ్లు ఏర్పడ్డాయి. అందువల్ల ఆ విగ్రహం అర్చనకు పనికిరాదని ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న యాదవ రాజు సహాయంతో సుద్ధతో(సున్నం) స్వామి వారి విగ్రహాన్ని తయారు చేశాడు. ఇప్పుడు స్వామి వారు ఉన్న స్థానంలో ప్రతిష్టాపన చేశాడు.అభిషేకం చేస్తే విగ్రహం కరిగిపోతుంది. అందువల్లనే గోవింద రాజస్వామి వారికి అభిషేకాలు నిషేధించాలని భావించారు. అలా సున్నం తో చేసిన విగ్రహాన్ని మనం ఇప్పటికీ ఆలయం లో దర్షిస్తున్నాం.
Manchi neeti gunta lo
Govindaraja Swamy vigraham
చిదంబరం నుండి తెచ్చిన విగ్రహాన్ని తిరుపతిలో మంచినీటి కుంట అని పిలిచే చోట రామానుజుల ఉంచారు. మహతి ఆడిటోరియం దగ్గరలో ఉండే మంచినీటి కుంట లో రావి చెట్టు క్రింద స్వామి వారి విగ్రహం ఇప్పటికీ ఉందని స్థానికులు చెబుతారు....
To know
# stories of tirumala
# best visiting places in tirumala
# Sevaas and updates from tirumala
Comments
Post a Comment