Tirumala vaibhavam: Tirumala Nambi - Stories of tirumala(తిరుమల నంబి గారి కథ): తిరుమల నంబి గారు స్వామి వారి ప్రియ భక్తులలో ఒకరు. శ్రీరంగం లో వరద రాజ స్వామి వారి సేవ చేస్తూ ఉన్న యామనాచార్యుల వారి శిష్యుడు. అంతే కాదు భగవత్ రామానుజాచార్యుల వారికి మేన మామ. ఒక రోజు యామనాచార్యుల వారు శిష్యులను ఇలా అడిగారట " తిరుమల లో ఉండి స్వామి వారికి పూల తోటను పెంచి, స్వామి కి సేవ చేయడానికి తిరుమల లోనే ఉండి అక్కడ ఎండ, వాన,కీటకాలు, జంతువుల్ని తట్టుకుని స్వామి వారికి సేవ చేయడానికి మీలో ఎవరైనా వెళతారా అని." తిరుమలనంబి గారు తిరుమల నంబి గారికి స్వామి వారు అంటే ఎన లేని భక్తి అందువల్ల తిరుమల నంబి గారు లేచి నేను వెళతాను అని చెప్పి తిరుమలకు చేరుకొన్నారు. తిరుమల లో స్వామి వారికి మంచి సువాసన కలిగిన పూల మొక్కలను పెంచి స్వామి వారి తోమాల సేవకు మరియు అలంకరణకు పంపేవారట. రక రకాల పూల మొక్కలను స్వామి వారి సేవ కోసం పెంచి స్వామి వారి సేవలో తరించే వారు. ఆకాశగంగ తీర్థం ఎలా ఏర్పడింది:( aakasaganga theertham story) రోజు ఉదయాన్నే పాపవినాశనం నుండి కాలినడకన స్వామి వారి అభిషేకానికి నీటిని తీసుకుని వచేవారట. అలా తెచ్చిన నీటి ...