జపాలి :
ఏడు కొండలలో అత్యంత ప్రశాంతతని కలిగించే ప్రదేశాలలో జపాలి తీర్థం మొదటిది. పాప వినాశనం కు వెళ్లే దారిలోనే జపాలి కూడా ఉంది. రోడ్డు మార్గం నుడి కొంత కాలి నడక దూరం తో కలిగిన ఈ ప్రదేశం మనసుకు ఎంతో ఆనంద పరవశాన్ని కలిగిస్తాయి. ఈ జపాలి తీర్థంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఉంది. జపాలి ని సందర్శించిన వారు ఒక ప్రత్యేక అనుభూతికి లోనవుతారు.
ఆకాశగంగ :
తిరుమల లోని అత్యంత ఆహ్లాద కరమైన ప్రదేశాలలో ఆకాశగంగ తీర్థం ఒకటి. ఆకాశ గంగ నుండి వచ్చే నీటి తోనే రోజు స్వామి వారికి అభిషేకం చేస్తారు. దీనికోసం పూజారులు సుప్రభాత సేవకు ముందే కాలినడకన వెళ్లి అభిషేకానికి నీటిని తీసుకుని వస్తారు. ఇక్కడ కొండలో నుండి జారే నీరు చేస్తుంది. పాపా వినాశనం లో ఉండే నీరు ఇక్కడ ప్రవహిస్తుందని ప్రతీక. సంవత్సరం పొడవునా ఇక్కడ ఉన్నప్పటికీ వర్షాకాలం లో ఇక్కడ ఎక్కువ ఆహ్లవుదాకరంగా ఉంటుంది.
Comments
Post a Comment