Tirumala vaibhavam:
Tirumala Nambi - Stories of tirumala(తిరుమల నంబి గారి కథ):
తిరుమల నంబి గారు స్వామి వారి ప్రియ భక్తులలో ఒకరు. శ్రీరంగం లో వరద రాజ స్వామి వారి సేవ చేస్తూ ఉన్న యామనాచార్యుల వారి శిష్యుడు. అంతే కాదు భగవత్ రామానుజాచార్యుల వారికి మేన మామ. ఒక రోజు యామనాచార్యుల వారు శిష్యులను ఇలా అడిగారట " తిరుమల లో ఉండి స్వామి వారికి పూల తోటను పెంచి, స్వామి కి సేవ చేయడానికి తిరుమల లోనే ఉండి అక్కడ ఎండ, వాన,కీటకాలు, జంతువుల్ని తట్టుకుని స్వామి వారికి సేవ చేయడానికి మీలో ఎవరైనా వెళతారా అని."
తిరుమలనంబి గారు
తిరుమల నంబి గారికి స్వామి వారు అంటే ఎన లేని భక్తి అందువల్ల తిరుమల నంబి గారు లేచి నేను వెళతాను అని చెప్పి తిరుమలకు చేరుకొన్నారు. తిరుమల లో స్వామి వారికి మంచి సువాసన కలిగిన పూల మొక్కలను పెంచి స్వామి వారి తోమాల సేవకు మరియు అలంకరణకు పంపేవారట. రక రకాల పూల మొక్కలను స్వామి వారి సేవ కోసం పెంచి స్వామి వారి సేవలో తరించే వారు.
ఆకాశగంగ తీర్థం ఎలా ఏర్పడింది:( aakasaganga theertham story)
రోజు ఉదయాన్నే పాపవినాశనం నుండి కాలినడకన స్వామి వారి అభిషేకానికి నీటిని తీసుకుని వచేవారట. అలా తెచ్చిన నీటి తోనే పూజారులు స్వామి వారికి అభిషేకం చేసేవారు. ఒక రోజు పాప వినాశనం నుండి నీటిని తీసుకుని వస్తుండగా స్వామి వారు బోయ వాని రూపంలో వెళ్లి తాగడానికి నీళ్లు అడిగాడట. ఇది స్వామి వారి అభి షే కం కోసం తీసుకుని వెళ్తున్న నీరు అని నీళ్లు ఇవ్వకుండా తన దారిన వెలుతున్నడట. అప్పుడు ఆ బోయవాడు కుండకు చిన్న రంధ్రం పెట్టి నీళ్లు తాగుతున్నాడు. కుండ బరువు తగ్గడంతో తో ఇది గమనించిన తిరుమల నంబి వెనక్కి తిరిగి చూసి ఆ బోయ వాడితో " ఇవి స్వామి వారి కోసం తీసుకుని పోతున్న నీళ్లు.. ఇప్పటికీ ఆలస్యమైంది నేను మళ్లీ ఎలా నీళ్లను తీసుకుని పోయేది అని" ఆ బోయ వాడిని నిందించాడు. అప్పుడు ఆ బోయ వాడు తాత నాతో రా నీకు స్వచ్చమైన నీటిని చూపిస్తాను అని ఒక కొండ దగ్గరకు వెళ్లి ఆ కొండకు తన బాణం తొ ఒక రంధ్రాన్ని పెట్టీ ఇక నుండి ఈ నీటి తోనే తనకు అభిషేకం చేయమని చెప్పి మాయం అయ్యాడట. అప్పుడు తిరుమల నంబి తనతో నాటకం ఆడింది శ్రీనివాసుడే గ్రహించాడట.
దీనిని బట్టి అర్థం అవుతుంది స్వామి వారికి తన భక్తులు అంటే ఎంత ప్రీతి అని. ఆ కొండ రంధ్రం నుండి కారే నీటిని ఆకాశ గంగ అని పిలుస్తున్నారు. ఈ విధంగా ఆకాశగంగ తీర్థం ఏర్పడింది. చుట్టూ ఎంతో ఆహ్లాద కరమైన వాతావరణం తో మనసుకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది. నేటికీ ఈ ఆకాశ గంగ నుండి తెచ్చిన నీటితోనే స్వామి వారికి అభిషేకం చేస్తారు.
To know
# tirumala stories
# process of dharshan
# best visiting places in tirumala
Avunu aakasaganga neeti thone ippatiki abhishekam chesthunnaru..
ReplyDelete