తిరుపతిలో భక్తుల కోసం టీటీడీ అందించే సేవలు
తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో అనేక ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ వారి దర్శనార్థం వేల కొలది భక్తులు తిరుపతి నుండి తిరుమలకు చేరుకోవడం జరుగుతుంది. బస్సు ద్వారా వచ్చే ప్రయాణికుల కోసం శ్రీనివాసం మరియు రైలు మార్గం ద్వారా వచ్చే భక్తుల వేచి ఉండటం మరియు విశ్రాంతి కోసం విష్ణు నివాసం పేరుతో పెద్ద భవనాలు నిర్మించడం జరిగింది. ఇక్కడ online మరియు offline ద్వారా గదులు బుక్ చేసుకోవచ్చును. శ్రీ వారి దర్శనానికి ఇక్కడే టిక్కెట్లు ఇవ్వడం జరుగుతుంది.భక్తులకు ఉచిత అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు. తిరుపతి నుండి తిరుమలకు వెళ్ళడానికి బస్సులను ఏర్పాటు చేశారు. అలిపిరి మేట్లు, శ్రీవారి మెట్ల వద్దకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.
తిరుపతి లోని వివిధ ఆలయాలలో దర్శన ఏర్పాట్లు,ప్రసాదం సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. తిరుమలకు ఎక్కువ మంది మెట్ల మార్గం గుండా వెళ్ళడానికి ఇష్టపడతారు. అందువల్ల అలిపిరి మార్గం మరియు శ్రీవారి మెట్ల మార్గాన్ని ఎంతో అందంగా సౌకర్య వంతంగా తీర్చి దిద్దారు. మార్గం లో మంచి నీటి సౌకర్యం మరియు ఉచిత మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.మార్గ మధ్యంలో లో ఎంతో సుందరంగా వనాలను తీర్చి దిద్దారు. Lock down కారణం గా భద్రత ల దృష్ట్యా శ్రీ వారి మెట్ల మార్గాన్ని మూసివేయడం జరిగింది. సాధారణ పరిస్థితులు ఏర్పడిన తరువాత ఈ మార్గాన్ని మరల తెరవడం జరుగుతుంది...
( NOTE: కరోనా రోగుల సౌకర్యార్తం శ్రీనివాసం మరియు విష్ణు నివాసం లను కోవిద్ సెంటర్లు గా మార్చడం జరిగింది. ఈ మహమ్మారి పూర్తిగా తగ్గిన తరువాత వీటిని మరల భక్తులకు కేటాయించడం జరుగుతుంది. )
Useful information about Tirumala Devasthanam (TTD). Another way also we have to reach Tirumala right... I forgot name Annamaya Garu reached Tirumala that way only...
ReplyDeleteAnnamayya gaaru kuda alipiri dhaarilone vellaadanta. Andhukane movie lo kuda mokaalla parvatham gurinchi undhi..
ReplyDelete