Tirumala tirupathi venkateswara Swamy temple story:
తిరుమల ఆలయ చరిత్ర :
కలియుగంలో భక్తులను తరింపజేయడానికి క్షిర సాగరంలో కొలువు తీరిన శ్రీ మహా విష్ణువు తిరుమల కొండలలో శ్రీనివాసునిగా అవతరించాడు. శ్రీ వారు భూమాత కి ఇచ్చిన మాట ప్రకారం వెంకటాద్రి పై కాలు మోపాడు. ఏడుకొండలలో స్వయంభువుగ వెలసిన శ్రీవారి ఆలయ నిర్మాణం మూడు సార్లు జరిగినది.విశ్వ కర్మ చే ఆలయ నిర్మాణం :
కొన్ని కోట్ల సంవత్సరాల కు పూర్వం శంఖన మహారాజు స్వామి వారి కోసం తిరుమల లోని శిలా తోరణం వద్ద తపస్సు చేశాడట. స్వామి వారు ప్రత్యక్ష మై తాను ఇక్కడే కొలువుంటానాని తన విగ్రహాన్ని తయారు చేయించమని చెప్పాడట. అప్పుడు ఆ రాజు తనకు ప్రత్యక్ష మైన స్వామి వారి అంత విగ్రహాన్ని తయారు చేయించాడు. అపర బ్రహ్మ గా పేరొందిన విశ్వకర్మ గారి చేతుల మీదగా ఆలయ నిర్మాణం చేయించాడు. విశ్వకర్మ వేయిస్తంబాలతో ఆలయాన్ని నిర్మించినట్లు ఓ తమిళ గ్రంథంలో ఉంది. ప్రాకారాలు,గోపురాలు, మండపాల తో కూడిన ఆలయాన్ని నిర్మించాడు. బ్రహ్మాది దేతల సమక్షం లో స్వామి వారు ఆలయం లోకి ప్రవేశించారు. శంఖన మహారాజు స్వామి వారిని ఇక్కడే కొలువుండమని వేడుకోగా స్వామి వారు కొన్నాళ్ళు అదృశ్యమై తిరిగి కలియుగం లో అవతరిస్తానని చెప్పి అదృశ్యమయ్యాడు.ఆలయం తో పాటు భూ తీర్థం, శ్రీ తీర్థం కూడా కాల గర్భంలో కలిసి పోయాయి.
ద్వాపర యుగంలో:
ద్వాపర యుగంలో వైఖానసుడు(గోపినాధుడు )అనే బ్రాహ్మణుడు ఉండేవారు. ఈయనకు శ్రీ కృష్ణుడు అనే ఎనలేని భక్తి. ద్వారకకు వెళ్లి స్వామి వారిని దర్శించు కోవాలనుకున్నాడు. ఒక రోజు స్వామి వారు కలలో కనిపించి తన మూర్తి తిరుమల లో ఉందని వెళ్లి పూజలు నిర్వహించామని,. దారిలో రంగదాసు అనే భక్తుడు ఉన్నదని ఆయనను తన వెంట తీసుకుని వెళ్ళమని చెబుతాడు. వైఖానసుడు మరియు రంగాధాసు ఇరువురు వెళ్లి స్వామి వారు చెప్పిన ప్రదేశం లో వెతికారు. తింత్రిని చెట్టుకింద పుట్టలో ఉన్న స్వామి వారి విగ్రహానికి గోవు క్షీరం తో తదపగ పుట్ట కరిగి స్వామి వారి ప్రతిమ వారికి కనిపించింది. ఆ స్వామి వారికి ఒక మండపాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తూ ఉండేవారు. వైఖానసుడు పూజించిన విధానాన్నే ఇప్పటికీ తిరుమలలో ఆచరిస్తున్నారు. రంగధాసు స్వామి వారిని పూలతో అలంకరించే వాడు. స్వామి వారి సేవ కోసం పూల తోటలను ఏర్పాటు చేశాడు. పూల మొక్కలను నీటి కోసం భూ తీర్థం , శ్రీ తీర్థం ప్రవహించే పై భాగం లో రెండు బావులు తవ్వాడట. ఒక రోజు పుష్కరిణీ లో గంధర్వుడు ఆయన భార్యలతో స్నానం చేయడం రంగదాసు చుసాడట.వారినే తలుచుకుంటూ స్వామి వారి సేవను మరిచిపోయారు. వైఖానసుడు ఇక నీవు స్వామి వారి సేవకు అర్హూడవు కావని నిందించగా రంగదాసు తన తప్పు తెలుసకుని బాధపడ్డాడు. అప్పుడు స్వామి వారి రంగధాసు తో బాధ పడకు వచ్చే జన్మలో నువ్వు మహారాజు గా పుట్టి సర్వ భోగాలు అనుభవించి తిరిగి నా చెంతకు వస్తావు అని చెప్పాడట. కాల క్రమేణా ఈ ఆలయం కూడా కాల చక్రం లో కలిసి పోయింది.
కలియుగం లో:
స్వామి వారికి పద్మావతి దేవి తో వివాహం అయిన తరువాత 6 నెలల పాటు కొండ కిందనే అగస్త్య ముని ఆశ్రమంలో ఉన్నాడు. ఈ కాలంలోనే స్వామి వారి మామ గారు అయిన ఆకాశరాజు గారు కాలం చేస్తారు. అప్పుడు ఆకాశరాజు తమ్ముడు అయినటువంటి తొండమాన్ చక్రవర్తి తో తనకు కొండమీద ఆనంద నిలయాన్ని నిర్మించ వలసినదిగా ఆదేశించాడు. అప్పుడు తొండమాన్ చక్రవర్తి స్వామి వారికి రెండు ప్రాకారాలతో ఆనందనిలయాన్ని నిర్మించి ఇచ్చాడట. కాల గర్భంలో లో కలిసి పోయిన శ్రీ తీర్థం మరియు భూ తీర్థం బావులను తిరిగి తవ్వించాడట. స్వామి వారికి తొండమాన్ చక్రవర్తి అంటే ఎనలేని ప్రేమ. ద్వాపర యుగంలో స్వామి వారు ఇచ్చిన వరం వల్ల రంగదాసు తొండమాన్ చక్రవర్తి గా జన్మించాడు. నేటికీ మనం చూస్తున్న శ్రీవారి ఆలయం తొండమాన్ చక్రవర్తి కట్టించినదే.
తరువాత కాలం లో ఎందరో విజయ నగర రాజులు స్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేశారు. విశ్వకర్మ నిర్మించిన శ్రీవారి ఆలయం ఇంకా తిరుమల లో భూస్థాపితం లో ఉందని ప్రతీక.
To know:
#Stories of lard baalaji
#best places in tirumala
Ee story kosam chala try chesaanu finally I got it..
ReplyDelete