లాక్ డౌన్ తరువాత శ్రీవారి దర్శనం :
లాక్ డౌన్ తరువాత భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పిం చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానములు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా కొన్ని రకాలైన విధి విధానాలను రూపొందించింది. టీటీడీ ఉద్యోగులతో 2 రోజుల పాటు దర్శనానికి అనుమతించడం జరిగింది మరియు 3 వ రోజు తిరుమల లోని స్థానికులను దర్శనానికి అనుమతించడం జరిగింది. ఇక నుండి సాధారణ భక్తులను కూడా దర్శనానికి అనుమతించనున్నారు. ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి 3000 మందికి దర్శన భాగ్యం కల్పించనున్నారు.అలిపిరి మార్గం ద్వారా వచ్చే భక్తులకు 3000 టిక్కెట్లు కేటాయించనున్నారు. ప్రతి రోజు ఉదయం 6.30 నుండి రాత్రి 7. 30 వరకు మాత్రమే భక్తులను ఆలయంలోకి అనుమతిస్తారు.
శ్రీవారి దర్శనానికి గల నిబంధనలు :
- శ్రీ వారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పకుండ భౌతిక దూరం పాటించవలసి ఉంటుంది.
- మాస్క్ లు తప్పని సరిగా ఉపయగించాలి.
- అలిపిరి కాలి నడక మార్గం ద్వారా వచ్చే భక్తులను ఉదయం 6 నుండి సాయంత్రం 4 వరకు మాత్రమే అనుమతించనున్నారు.
- VIP దర్శనాన్ని ఉదయం 6. 30 నుండి 7. 30 వరకు మాత్రమే అనుమతిస్తారు.
- రోజుకి 7 వేల మందిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు.
- కొన్ని కారణాల వాళ్ళ శ్రీవారి మెట్ల మార్గాన్ని మూసివేయడం జరిగింది.
- 65 సంవత్సరాలు పై బడిన బడిన వారిని మరియు 10 సంవత్సరాల లోపు పిల్లలను దర్శనానికి అనుమతి నిషేధించడం జరిగింది.
- రోజుకు కేవలం 7 వేళా మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించడం జరుగుతుంది.
Nice information
ReplyDelete