శ్రీనివాసుని కళ్యాణం:
శ్రీ విష్ణువు యుగం లో వేంకటేశ్వరుని రూపం లో తిరుమల గిరులపై వెలసి భక్తుల కోరికలను నెరవేర్చి వారి పాపాలను హరిస్తున్నాడు. ఆ శ్రీనివాసుడు ఈ ఏడు కొండల మీద వెలిసిన కథ ను తెలుసుకుందాం.
భూదేవి విన్నపం :
సత్య యుగంలో నాలుగు పాదాల మీద ధర్మం కలియుగంలో ఒంటి కాలి మీద కుంటుతోందని భూమి మీద పాప భారం పెరిగిపోయిందని, ఈ పాప భారాన్ని తాను మోయలేనని భూమాత శ్రీ మహా విష్ణువు దగ్గరకు వెళ్లి మొరపెట్టుకుంది. భూమాత బాధ ను ఆలకించిన శ్రీ మహా విష్ణువు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు తాను కలియుగంలో తిరుమల కొండా మీద నిలుస్తానని భూదేవి కి మాట ఇచ్చాడు.తాను ఆడే ఈ జగన్నాటకానికి నారద నారద మహర్షి ని సూత్ర దారిగా ఎంచుకున్నాడు.భూమి మీద శ్రీ వారి రాక :
గంగ నది ఒడ్డున సప్త ఋషులందరు కలియుగ క్షేమం కోసం యాగాన్ని నిర్వహించారు. అప్పుడు నారద మహర్షి అక్కడకు వచ్చి ఆ యాగ ఫలాన్ని త్రిమూర్తులలో ఒకరికి ఇవ్వవలసిందిగా కోరాడు. అప్పుడు సప్త ఋషులందరు త్రిమూర్తులనే పరీక్షించు వారు ఎవరని వారిలో వారు చర్చించు కుండగా భృగు మహర్షి అందుకు సిద్ధం అయ్యాడు. మొదటిగా బ్రహ్మ దేవుని దగ్గరకు వెళ్లాడు. నారాయణుని నాటకాన్ని నాటకాన్ని గ్రహించిన బ్రహ్మ భృగు మహర్షి రాకను గ్రహించకుండా సరస్వతి దేవి వీణా గానం లో మునిగిపోయాడు. అప్పుడు తన రాకనే గుర్చించలేదన్న భృగు మహర్షి కోపం తో నీకు పూజా ప్రతిష్టలు ఉండవు గాక అని బ్రహ్మ దేవునికి శాపం పెట్టాడు. ఆ శాపం వల్లనే బ్రహ్మ దేవునికి భూలోకంలో ఇక్కడ గుడులు, పూజలు లేకుండా పోయాయి. అక్కడి నుండి శివుని దక్కరకు వెళ్ళాడు. కైలాసంలో శివుడు కూడా పార్వతి దేవి తో నట వైభవం లో మునిగి భృగు మహర్షి రాకను పక్కన పెట్టాడు. కోపం తో నీకు భూలోకం లో లింగ పూజయే జరుగు గాక అని శివునికి శాపం పెట్టి వైకుంఠానికి బయలుదేరాడు.
వైకుంఠం లో శ్రీ మహా విష్ణువు లక్ష్మి దేవి సేవలో సేద తీరుతూ మహర్షి రాకను గుర్తిచకుండా అల్లాగే ఉండిపోయాడు. ఎంత పిలిచినా పలకలేదనే కోపం తో శ్రీ మహాలక్ష్మి కొలావయినా శ్రీ వారి ఎద మీద కాలితో తన్నాడు. అప్పుడు మహావిష్ణువు లేచి భృగు మహర్షిని పాన్పుపై కూర్చోబెట్టాడు. ఆయన పదాలను నొక్కుతూ కాలి లోని అజ్ఞాన నేత్రాన్ని చిదిమాడు. వెంటనే భృగు మహర్షి తన అజ్ఞానాన్ని వీడి మహా విష్ణువు కాళ్ళ మీద పది వేడుకున్నాడు. ఇదంతా నేను ఆడుతున్న నాటకం మీరు కేవలం పాత్ర దారులు మాత్రమే అని చెప్పాడు .
ఇదంతా చుసిన మహాలక్ష్మి కోపం తో సామాన్య మానవుని పాదాలను తగిలిన శ్రీ వారి ఎద మీద తాను ఉండలేనని భూలోకానికి వెళ్లిపోయింది. శ్రీ మహా లక్ష్మి ని వెతుకుతూ శ్రీ వారు కూడా భూలోకానికి వచ్చాడు. తిరుమల గిరులపై కాలు మోపిన శ్రీవారు లక్ష్మి దేవిని వేతక సాగారు.
వకుళ మాతను కలుసుకోవడం:
భూలోకం లో శ్రీ వారు లక్ష్మి దేవిని వెతుకుతూ అలిసి పోయి ఒక పుట్టలో సేద తీరుతూ ఆకలి దప్పులతో అల్లాడుతున్నాడు. లక్ష్మి దేవి కోరిక మేరకు బ్రహ్మ శివులు ఆవు దూడలు గ మారి రోజు పుట్ట దగ్గరకు వెళ్లి పాలు ఇస్తూ ఉండేవారు. ఇది గమనించిన గోపాలుడు ఇందుకా రోజు పాలు తక్కువ ఇస్తున్నావు అని గోవు మీదకో గొడ్డలి ని విసిరగా అది అడ్డుకున్న శ్రీ వారి నుదురు మీద తగిలింది. శ్రీ వారు ఆ గోపాలుడికి తాను వచ్చిన పని కార్యం అయ్యే వరకు పిశాచి గ తిరుగు గాక అని శాపం పెట్టి ఎన్నో సంవత్సరాలు తన దర్శనం కోసం ఎదురు చూస్తున్న వకుళా దేవి దగ్గరకు వెళ్ళాడు. వకుళమాత శ్రీ వారి గాయానికి కట్టు కట్టి ఆయన ఆకలిని తీర్చింది. తన కొడుకుగా ఉండమని శ్రీవారిని అడిగింది.
పద్మావతి దేవి తో ప్రేమ లో పడటం :
త్రేతా యుగం లో సీతను రావణుడు ఎత్తుకెళ్లినాడు లంక లో బాధను అనుభవించింది అగ్ని దేవుని కుమార్తే అయినా వేదవతి. అందుకు రాముడు ఏదైనం వరం కోరుకోమని అడగగా తనను వివాహం చేసుకోమని అడిగింది. అందుకు రాముడు తాను ఏక పత్ని వ్రతుడనని వచ్చే జన్మల తన కోరిక తీరుస్తానని మాట ఇచ్చాడు. ఆ వేదవతి ఈ జన్మలో ఆకాశ రాజు కుమార్తె పద్మావతి దేవి గా జన్మించించింది. ఒక రోజు వేటకు వెళ్లిన శ్రీ వారు వన విహారం లో విహరిస్తున్న పద్మావతి దేవి ని చూసాడు. మొదటి చూపులోనే ఇరువురి మనస్సులో ప్రేమ చిగురించింది. గత జన్మల అనుబంధాలు మనసులో మెదిలాయి. అప్పటి నుండి శ్రీ వారు పద్మావతి దేవిని చూడటానికి రోజు వెళుతుండే వారు.
శ్రీనివాస పద్మావతి కళ్యాణం :
తాను పద్మావతి దేవి ని వివాహం చేసుకోవన్న కోరికను వకుళ మాత కు చెప్పాడు. ఆకాశ రాజు కుమార్తె అవ్వడం వల్ల కొంచెం అయోమయం లో పడినా శ్రీ వారి పట్టుదల వల్ల వివాహం విషయమై అడగడానికి ఆకాశ రాజు దగ్గరకు పయనమైంది. శ్రీ వారు ముందుగానే సోది చెప్పే రూపంలో వెళ్లి పద్మావతి గత జన్మ రహస్యం చెప్పి వివాహానికి ఒప్పుకోవాలని చెప్పింది. వకుళ మాత వెళ్లి అడగ గానే ఆకాశ రాజు వివాహానికి అంగీకరించి, శ్రీనివాస పద్మతి దేవి ల వివాహానికి ముహూర్తానికి నిశ్చయించాడు. వివాహానికి గల ధనాన్ని కుబేరుని దగ్గర శ్రీనివాసుడు అప్పుగా తీసుకున్నాడు. దీనికి వడ్డీ ని కలియుగాంతం వరకు చెల్లిస్తానని మాట ఇచ్చాడు. బ్రహ్మాది దేవతలు సకల ఋషుల సమక్షం లో శ్రీనివాసుస పద్మావతి దేవి ల కళ్యాణ మహాత్సవం జరిగింది.
శ్రీనివాసుని శిలా రూపం :
వివాహానంతరం శ్రీవారు పద్మావతి దేవి వన విహారం చేస్తుండగా నారద మహర్షి వీరి వివాహం గురించి తెలిసిన లక్ష్మి దేవి అక్కడకు వచ్చింది. లక్ష్మి దేవి , పద్మావతి దేవి ఇరువురు తగువు పడుతుండగా శ్రీ వారు విగ్రహ రూపాన్ని దాలుస్తారు. ఆ విగ్రహ రూపాన్ని చూసి బాధ పడుతున్న లక్ష్మిదేవి , పద్మావతి దేవి లకు నారద మహర్షి వచ్చి ఇదంతా శ్రీ వారు నాటకం అని , తాను కలియుగం లో ఇక్కడ వెలుస్తానని భూదేవి కి మాట ఇచ్ఛాడని, మాట ప్రకారం శ్రీ వారు ఈ తిరుమల కొండా మీద వెలిశారని చెబుతాడు.
ఆ నాటి నుండి శ్రీనివాసుడు కలియుగ దైవమై తన భక్తుల పాపాలను హరిస్తూ తిరుమల గిరులపై శోభాయమానం గ వెలుగుతున్నాడు. శ్రీనివాసుని దర్శనం చేసుకున్న వారికి సకల పాపాలు తొలిగి వారి కోరికలు నెరవేరుతాయి.
Comments
Post a Comment