శ్రీవారికి తల నీలాలు ఎందుకు సమర్పిస్తారు :
లక్ష్మిదేవి ని వెతుకుతూ వచ్చిన శ్రీవారు పుట్టలో సేద తీరుతున్న సమ్యం లో గోవు రోజు వచ్చి శ్రీవారి కి పాలు ఇస్తు ఉండేది. అది చూసిన గోపాలుడు ఆ గోవు మీదకి గొడ్డలిని విసిరాడు.స్వామి వారిని గోపాలుడు గొడ్డలితో కొట్టినప్పుడు స్వామి వారికి గాయం తగిలిన చోట వెంట్రుకలు తిరిగి రాలేదు. ఆయన తలలో ఆ గాయం ఒక మచ్చ లాగా మిగిలి పోయింది. ఒక నాడువేటకు వెళ్ళిన శ్రీవారు నీలాద్రి పర్వతం లో అలసిపోయి సేద తీరుతాడు. అలా సేద తీరుతున్న స్వామి నీలాంబరి దేవి వచ్చి ఆయనకు సేవ చేయ సాగింది. శ్రీ వారి తలలౌన్న ఆ గాయం మచ్చ ను చూసి నా స్వామి కి ఇలాంటి మచ్చ ఉండకూడదని తన వెంట్రుకలను తీసి స్వామి వారి గాయం తగిలిన చోట పెట్టింది. స్వామి వారు నిద్ర లేచిన తరువాత ఎందుకు ఇలా చేశావని అడుగగా, తన దర్శనానికి వచ్చిన భక్తుల తల నీలాలు ఆమెకు ప్రసదించ వలసినదిగా స్వామి వారిని కోరుకుంది. స్వామి వారు పద్మావతీ దేవి తొ విహాహం జరిగిన తరువాత తిరుమల గిరులలో స్వయంభువు గా శిలా విగ్రహం దాల్చి తన భక్తుల తల నీలాలు నీలాంబరి దేవికి చేరేలా వరాన్ని ప్రసాదించాడు. ఆ నాటి నుండి నేటి కి శ్రీ వారి భక్తులు ఇచ్చిన తల నీలాలు అన్ని నీలాంబరి దేవి కి చేరుతాయి.
To know more interesting stories
# stories of tirumala
# best visiting places of tirumala
# latest updates from tirumala
Comments
Post a Comment