Skip to main content

Posts

Ananthaachaaryula vaaritho Swamy leelalu

Stories of tirumala: అనంతాల్వారు శ్రీనివాసునికి మామ ఎలా అయ్యాడు: అనంతాల్వారు శ్రీనివాసునికి ప్రియ భక్తుడు. భగవత్ రామానుజుల వారి శిష్యుడు.  ఆయన కోరిక మేరకు స్వామి వారి సేవ కోసం తిరుమల కు వచ్చిన వాడు. స్వామి వారి సేవ కు అయ్యేటటువంటి పూల కోసం ఒక పూల తోటను పెంచడానికి తిరుమలకు చేరుకున్నారు. తిరుమలనంబి గారి సలహాతో స్వామి వారి ఆలయం వెనుక పూల తోటను పెంచి వాటిని స్వామి సేవకు అర్పించేవాడు. పూల చెట్లకు నీటి కోసం ఒక చెరువును తవ్వడానికి సంకల్పించాడు. ఆయన మరియు గర్భ వతిగా ఉన్న ఆయన భార్య కలిసి చెరువును తవ్వుతుండగా స్వామి వారు బాలుడి రూపంలో అక్కడకు వచ్చాడు. నేను కూడా సహాయం చేస్తాను అని అనంతాల్వారుని అడిగాడు. బాలుడి రూపంలో వచ్చినందున స్వామిని ఆయన గుర్తు పట్టలేదు. ఈ భాగ్యం మాకు మాత్రమే కావాలని ఇది వారి పూర్వ జన్మ సుకృతం అని ఆ బాలుడి అభ్యర్థనను తిరస్కరిస్తాడు. స్వామి వారు అక్కడనుండి వెళ్లి అంతాల్వరు భార్యకు సహాయం చేస్తూ ఉంటాడు. ఇది చూసిన అనంతాల్వారు కోపం తో తన చేతిలో ఉన్న గునపం తొ స్వామి వారిని కొడతాడు. ఆ గునపం స్వామి వారి గడ్డానికి తగులుతుంది. అనంతాల్వారు స్వామి వారికి పూలను తీసుకుని ఆ...

PAAPA VINAASANAM

PAAPA VINAASANAM: పాపవినాశనం: పాపవినాశనం తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు సందర్శించుకోవాలనుకునే స్థలం. పాపవినాశనం లో స్నానమాచరిస్తే సకల పాపాలు హరించుకు పోతాయనేది ఇక్కడి ప్రతీక. సీత దేవిని వెతుకుతున్న సమయం లో రామ లక్ష్మణులు ఈ  వినాసనంలో స్నానం  చేశారని పురాణాలు చెబుతున్నాయి. పాపవినాశనం లో పుణ్య స్నానం చేస్తే మనసుకు ప్రశాంతత , ఉత్సాహం కలుగుతుందని చెబుతారు.  ఆకాశ గంగ తీర్థం ఏర్పడక ముందు స్వామి వారికి ఇక్కడ నుండే అభిషేకానికి జలాన్ని తీసుకుని వెళ్లేవారు. 

Chakra theertham, silaathoranam

చక్ర తీర్థం, శిలా తోరణం : చక్ర తీర్థం తిరుమలలోని అత్యంత పవిత్రమైన తీర్థాలలో ఒకటి. చక్ర తీర్థం లో నీటి కొలనుతో పాటు శివుని దర్శనం కూడా చేసుకోవచ్చు. సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణాన్ని చూస్తే ఆశ్చర్యపోని వారు ఉండరు. ఇక్కడి శిలలా విన్యాసం ఎంతో అద్భుతంగా ఉంటుంది. సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ శిలాతోరణం ప్రపంచంలో మూడు ప్రదేశాలలో మాత్రమే ఉంది. శిలా తోరణం చుట్టూ ఉండే రాళ్ళు సహజసిద్ధంగా శిలల లాగా కనిపిస్తాయి. చుట్టూ లోయలలో కూడిన ఈ ప్రదేశం కనులకెంతే ఇంపుగా కనిపిస్తాయి. శిలా తోరణం,చక్ర తీర్థం

S.V Museum

యస్. వి మ్యూజియం ;  స్వామి వారి ఆలయం వెనక భాగం లో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ను సందర్శించ వచ్చు. ఇక్కడ తిరుమల కు సంబంధించి అతి పురాతన వస్తువులను సందర్శించ వచ్చు. స్వామి వారికి స్సంబంధించిన ఎన్నో ఆనవాళ్లు ఇక్కడ దర్శన మిస్తాయి. ఆ నాటి రాజులు ఉపయోగించిన ఆయుధాలు, సంగీత వాయిధ్యాలు ఇక్కడ చూడవచ్చును. ఈ మ్యూజియం యొక్క కట్టడం కూడా ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. .                

Tirumala places

Haathiraam baabaji samaadhi: తిరుమల లో హాతీరం బాబాజీ సమాధి ఇక్కడ ఉందో తెలుసా?: పాపవినాశనం కు వెళ్లే దారిలోనే వేణుగోపాల స్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయం కూడా తిరుమలలో చూడదగిన ప్రదేశాలలో ఒకటి. ఈ ఆలయం పక్కనే హాతీరాం బాబాజీ సమాధిని తీసుకున్నాడు. హాతిరాం బబాజితో సాక్ష్యాత్తు శ్రీ వారే వచ్చి పాచికలు ఆడాడు. దగ్గర ఒక ఆకును ప్రసాదంగా ఇస్తారు. ఇది ఇక్కడ ప్రత్యేకం. శ్రీ వారు తన భక్తుల కోసం ఎదైన చేస్తారు అనడానికి ఇది ఒక నిదర్శనం. స్వామి వారి వైభవాన్ని తిరిగి పునరుద్ధరించి న వారిలో హాతిరం బాబాజీ కూడా ఒకరు. హాథిరం బాబాజీ మఠం ఇప్పటికీ తిరుమల లో ఉంది. ఈ సారి తిరుమలకు వెళ్ళినపుడు ఈ ప్రదేశాన్ని కూడా సందర్శించి రండి.

JAPAALI AND AAKASAGANGA

జపాలి : ఏడు కొండలలో అత్యంత ప్రశాంతతని కలిగించే ప్రదేశాలలో జపాలి తీర్థం మొదటిది. పాప వినాశనం కు వెళ్లే దారిలోనే జపాలి కూడా ఉంది. రోడ్డు మార్గం నుడి కొంత కాలి నడక దూరం తో కలిగిన ఈ ప్రదేశం మనసుకు ఎంతో ఆనంద పరవశాన్ని కలిగిస్తాయి. ఈ జపాలి తీర్థంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఉంది. జపాలి ని సందర్శించిన వారు ఒక ప్రత్యేక అనుభూతికి లోనవుతారు.  ఆకాశగంగ : తిరుమల లోని అత్యంత ఆహ్లాద కరమైన ప్రదేశాలలో ఆకాశగంగ తీర్థం ఒకటి. ఆకాశ గంగ నుండి వచ్చే నీటి తోనే రోజు స్వామి వారికి అభిషేకం చేస్తారు. దీనికోసం పూజారులు  సుప్రభాత సేవకు ముందే కాలినడకన వెళ్లి అభిషేకానికి నీటిని తీసుకుని వస్తారు. ఇక్కడ కొండలో నుండి జారే నీరు   చేస్తుంది. పాపా వినాశనం లో ఉండే నీరు ఇక్కడ ప్రవహిస్తుందని ప్రతీక. సంవత్సరం పొడవునా ఇక్కడ ఉన్నప్పటికీ వర్షాకాలం లో ఇక్కడ ఎక్కువ ఆహ్లవుదాకరంగా ఉంటుంది.  ఆకాశగంగ

Sri vaariki thala neelaalu samarpinchadam venuka story

శ్రీవారికి తల నీలాలు ఎందుకు సమర్పిస్తారు : లక్ష్మిదేవి ని వెతుకుతూ వచ్చిన శ్రీవారు పుట్టలో సేద తీరుతున్న సమ్యం లో గోవు రోజు వచ్చి శ్రీవారి కి పాలు ఇస్తు ఉండేది.  అది చూసిన గోపాలుడు ఆ గోవు మీదకి గొడ్డలిని విసిరాడు.స్వామి వారిని గోపాలుడు గొడ్డలితో కొట్టినప్పుడు స్వామి వారికి గాయం తగిలిన చోట వెంట్రుకలు తిరిగి రాలేదు. ఆయన తలలో ఆ గాయం ఒక మచ్చ లాగా మిగిలి పోయింది. ఒక నాడువేటకు వెళ్ళిన శ్రీవారు నీలాద్రి పర్వతం లో అలసిపోయి సేద తీరుతాడు. అలా సేద తీరుతున్న స్వామి నీలాంబరి దేవి వచ్చి ఆయనకు సేవ చేయ సాగింది. శ్రీ వారి తలలౌన్న ఆ గాయం మచ్చ ను  చూసి నా స్వామి కి ఇలాంటి మచ్చ ఉండకూడదని తన వెంట్రుకలను తీసి స్వామి వారి గాయం తగిలిన చోట పెట్టింది. స్వామి వారు నిద్ర లేచిన తరువాత ఎందుకు ఇలా చేశావని అడుగగా, తన దర్శనానికి వచ్చిన భక్తుల తల నీలాలు ఆమెకు ప్రసదించ వలసినదిగా స్వామి వారిని కోరుకుంది. స్వామి వారు పద్మావతీ దేవి తొ విహాహం జరిగిన తరువాత తిరుమల గిరులలో స్వయంభువు గా శిలా విగ్రహం దాల్చి తన భక్తుల తల నీలాలు నీలాంబరి దేవికి చేరేలా వరాన్ని ప్రసాదించాడు. ఆ నాటి నుండి నేటి కి శ్రీ వారి భక్తులు ఇచ్చిన తల...