Sevas of TTD: Daily sevaas in Tirumala: స్వామి వారికి జరిగే సేవలు: తిరుమల ఆనంద నిలయం లో కొలువు దీరిన శ్రీ వారికి రోజు అనేక సేవలు జరుగుతుంటాయి.స్వామి వారికి జరిగే సేవలన్నింటింటి వైఖానస ఆగమం ప్రకారమే జరుగుతాయి. స్వామి వారికి నిత్యం జరిగే సేవలను ఒకసారి గమనిద్దాం. Daily Sevaas: రోజు వారి సేవలన్నీ స్వామి వారి ఆనంద నిలయం లోనే జరుగుతాయి. అవి: సుప్రభాత సేవ (suprabhatha seva): ప్రతి రోజు వేకువజామున సుప్రభాత సేవతో "కౌసల్య సుప్రజా రామ" అంటూ శ్రీ వారిని మేల్కొల్పుతారు. సుప్రభాత సేవ ధనుర్మాసం లో తప్ప మిగిలిన అన్ని రోజులలో జరుగుతుంది. సుప్రభాత సేవ లో పాల్గొన దలచిన భక్తులు తిరుమల లో విజయ బ్యాంక్ లో రిజిస్టర్ చేసుకోవాలి. లాటరీ విధానం ద్వారా సుప్రభాత సేవలో భక్తుల వివరాలను వెల్లడిస్తారు. వివరాలను పొందిన భక్తులు వేకువ సమయంలో వెళ్ళ వలసి ఉంటుంది. అర్చన సేవ (archana seva) : స్వామి వారికి ప్రతి మంగళ, బుధ, గురు వారాలలో సహస్ర నామాలతో అర్చన చేస్తారు. అర్చన సేవ సుప్రభాత సేవ అనంతరం జరుగుతుంది. తోమాల సేవ (thomaala seva): తోమాల సేవలో స్వామి వారిని వివిధ రకాలయిన పుష్పాలతో అలంకరిస్తారు. స్వామి వారి పుష్ప...