Stories:
చిదంబర ఆలయం:
తమిళనాడు లోని చిదంబరం లో ఉండే ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయం లో శివకేశవుల ఆలయాలు మనకు దర్శనమిస్తాయి. ఈ ఆలయం ఎత్తైన గోపురాలు, ప్రాకారాలతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయానికి తొమ్మిది ధ్యారాలు, ఆలయంలో అయిదు మండపాలు ఉన్నాయి. దాదాపుగా 46 ఎకరాలలో ఉన్న ఈ ఆలయ శిల్ప సౌందర్యానికి ముగ్ధులు కానీ వారు ఉండరు. ఎంతో చరిత్ర ఉన్న ఈ ఆలయం లో జరిగిన కొన్ని సంఘటనలు తెలుసుకుందాము..
ఈ ఆలయం లో పరమశివుడు నటరాజ స్వామి రూపం లో దర్శనం ఇస్తాడు. శివుడు నటరాజ స్వామి రూపం లో కొలువుదీరిన ఆలయాలు చాలా తక్కువగా ఉన్నాయి. దక్షిణానికి అభిముఖంగా నిత్యం పూజలందుకుంటూ ఉన్న నటరాజ స్వామి ని చూడటానికి భక్తులు చాలా ఎక్కువగా వస్తుంటారు. నటరాజ స్వామి కి కుడి వైపున శ్రీ మహా విష్ణవు శ్రీ గోవింద రాజ స్వామి రూపంలో దర్శనం ఇస్తాడు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీ గోవింద రాజ స్వామి తూర్పు కు అభిముఖంగా దర్శనం ఇస్తాడు. 9 వ శతాబ్దం లో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన పల్లవులు ఈ ఆలయాన్ని ఎంతగానో అభివృధ్ది చేశారు. వారు వైష్ణవ భక్తులు అవ్వడం వల్ల గోవింద రాజ స్వామి నటరాజ స్వామి తో సమానంగా పూజలు అందుకునే వాడు..
తరువాత కాలం లో చోళులు పల్లవుల ను ఓడించి చిదంబరాన్ని తమ పరిపాలనలో కి తెచ్చుకున్నారు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. చోళులు శివ భక్తులు అందువల్ల దక్షిణ భారత దేశంలో శైవ మత ప్రచారం ఎక్కువగా చేసేవారు. వైష్ణవ ఆలయాలు ఎన్నింటినో ధ్వంసం చేశారు. 11 వ శతాబ్దం లో చోళుల రాజైన కులోత్తుంగ చోళుడు అనే రాజు నటరాజ స్వామితో సమానంగా పూజలు అందుకుంటున్న గోవింద రాజ స్వామి విగ్రహాన్ని సముద్రం లో పడవేయాలని భావించాడు. గోవింద రాజ స్వామి వారిని ఆలయం నుండి బయటకు తీసుకుని వచ్చినపుడు ఎంతో మంది వైష్ణవులు అడ్డగించారు. ఆ రాజు తన సైనికుల కత్తులకు పని చెప్పాడు. ఎంతో మంది వైష్ణవుల రక్తం ఏరులై పారుతోంది. అయిన ఆ చోళ రాజు చలించకుండా గోవింద రాజ స్వామి విగ్రహాన్ని సముద్రంలో పడవేయించాడు.. తరువాత కొన్ని సంవత్సరాలకు ఆ విగ్రహం బయట పడి ప్రస్తుతం తిరుపతిలో ఉంది..
చోళుల రాజ్యాలు పతనం అయిన తరువాత తెలుగు వాడైన కృష్ణప్ప నాయర్ అనే రాజు చిదంబర ప్రాంతాన్ని పరిపాలించాడు. ఈ రాజు విష్ణు భక్తుడు అవ్వడం వల్ల తిరిగి ఆలయం గోవింద రాజ స్వామి వారిని ప్రతిష్టించాలని తలిచాడు. ఎంతో మంది శైవులు దీనికి అడ్డుపడ్డారు. ఈ రాజు కూడా తన బలంతో శైవుల రక్తాలు కారుతుండగా గోవింద రాజ స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశాడు.
ప్రస్తుతం చిదంబరం లో శివకేశవుల విగ్రహాలు చిదంబరం లో ఉన్నాయి.ఇంత రక్త పాతం ఈ ఆలయానికి చరిత్రగా ఉంది. సముద్రం లో పడవేసిన విగ్రహాన్ని వైష్ణవ భక్తులు తిరుపతికి చేర్చి మంచినీళ్ళ గుంట ప్రదేశం లో ఉంచారు.
To know more
# Interesting stories
# Devotional places
Visit: vaikuntamtrip.blogspot.com
Comments
Post a Comment