VIMAANA VENKATESWARA SWAMY:
విమాన వెంకటేశ్వర్ స్వామి ఎలా ఏర్పడ్డాడు :
తిరుమల శ్రీ వెంకట నారాయణుని దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు వెంకటాద్రికి చేరుకుంటారు. స్వామి వారి దర్శనానికి వెళ్ళినపుడు ఆలయంలో ఎన్నో అద్భుతాలు , విశేషాలు కూడా మనకు దర్శనం ఇస్తాయి. వాటిలో విమాన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒకటి. ఆనంద నిలయం పై ఉన్న విమాన వెంకటేశ్వర స్వామి ఎలా ఏర్పడ్డాడు అనే విషయం గురించి మనం తెలుసుకుందాం.
పూర్వం తిరుమలను పరిపాలించిన రాజులలో సాళువ నరసింహ రాయలు ఒకరు. ఈయన స్వామి వారికి పరమ భక్తుడు. స్వామి వారి ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేసి , ఎన్నో కానుకలు సమర్పించాడు. ఈయన కాలం లో ఒక సారి స్వామి వారి నగలు దొంగతనానికి గురి కాబడ్డాయి. అందువల్ల ఆ రాజు దొంగతనం చేసిన వారిని ఆలయంలోనే శిరచ్చేదనం చేస్తాడు . పవిత్రమైన గుడి ప్రాంగణంలో వారిని శిరచ్చేదనం చేసినందువల్ల పాప పరిహారం చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో స్వామి వారికి అర్చనలతో పాటు అన్ని సేవలను వ్యాస రాయల వారు చేస్తూ ఉండేవారు. పాపా పరిహారం చేస్తున్న సమయంలో దాదాపుగా 12 సంవత్సరాలు భక్తులను భక్తులను దర్శనానికి . అప్పుడు స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులు దర్శించు కోవడం కోసం ఆనందనిలయం వాయువ్య దిశలో విమాన వెంకటేశ్వర స్వామి ని ఏర్పాటు చేసి ప్రాణ ప్రతిష్ట చేసాడు. విమాన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే గుడిలో ఉన్న స్వామిని దర్శనం చేసుకున్నట్లే అని వ్యాసరాయల వారు తెలిపారు. స్వామి వారి దర్శనం చేసుకున్న తరువాత హుండీ కి వెళ్లే దారిలో ఆనంద నిలయం పైన ఇప్పటికి విమాన వెంకటేశ్వర స్వామిని చూడవచ్చు. ఈ సారి దర్శనానికి వెళ్ళినపుడు తప్పక విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని రండి.
TO KNOW MORE
# INTERESTING STORIES
# LATEST UPDATES
Comments
Post a Comment