7th NOV 1979 AT TIRUMALA TEMPLE : 1976 లో తిరుమల : తిరుమల లో శ్రీనివాసుడు స్వయంభువు గ వెలిసి ఉన్నాడు అని చెప్పడానికి ఎప్పుడు ఏదో ఒక అద్భుత సంఘటనలు జరుగుతూ ఉంటాయి . ఆ వేంకటేశ్వరుడు తన భక్తులకు ఎప్పుడు అండగా ఉంటాడు అని చెప్పడానికి 1979 లో జరిగిన ఒక సంఘటనను తెలుసుకుందాం . ఈ సంవత్సరం లో తిరుమలలో నీటి నిలువలు బాగా తగ్గిపోయాయి . తిరుమల అంతటికి గోగర్భం రిజర్వాయరు నుండి నీటిని వినియోగించేవారు . ఆ రిజర్వాయరులో కూడా నీటి నిలువలు అడుగంటిపోయాయి . కొండా మీద ఉండే ఇతర చెరువులు కూడా ఇంకిపోయాయి . ఆ సమయంలో టీటీడీ పరిపాలనాధికారి గా PVRK ప్రసాద్ గారు ఉన్నారు . కొండా మీద ఉండే నీటి నిలువలు కేవలం వారం రోజులకు మాత్రమే సరిపోతాయని ఇంజినీర్లు చెప్పారు . శ్రీ వారి దర్శనాన్ని కూడా నిలిపివేయాల్సి పరిస్థితి వచ్చేలా ఉందని టీటీడీ సభ్యులందరు సమావేశమయ్యారు . ఆ సమావేశంలో వర్షాలు పడటానికి యాగం చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని సలహా ఇచ్చారు . PVRK ...